భూసేకరణ చట్టం అమలుపై రాజధాని ప్రాంత గ్రామాల రైతులు మండిపడుతున్నారు.
విజయవాడ : భూసేకరణ చట్టం అమలుపై రాజధాని ప్రాంత గ్రామాల రైతులు మండిపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటనపై రాజధాని ప్రాంత రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. న్యాయపోరాటం ద్వారా భూ సేకరణను అడ్డుకుంటామని రైతులు అంటున్నారు. బలవంతంగా భూసేకరణ చేస్తే జాతీయ స్థాయిలో మరోసారి భూ పోరాటం చేస్తామని ఆ రైతులు సూచించారు.
ఏక పక్షంగా రైతుల నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రభుత్వ నిర్ణయంపై జాతీయ నేతలను కలిసేందుకు అమరావతి రైతులు సిద్ధమవుతున్నారు. అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కునేందుకు యత్నిస్తున్నారంటూ ఎస్సీ, ఎస్టీ కమిషన్ను ఆశ్రయించేందుకు దళితులు నిర్ణయించుకున్నారు. భూ సేకరణ చట్టం అమలు నిర్ణయంపై రాజధాని ప్రాంత గ్రామాల్లో టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు.