రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో 20 మంది గాయపడ్డారు
దొరవారిసత్రం (నెల్లూరు జిల్లా) : నెల్లూరు జిల్లా దొరవారి సత్రం మండలం నెలబల్లి సమీపంలో జాతీయరహదారిపై గురువారం తెల్లవారుజామున రెండు బస్సులు ఢీకొన్నాయి. కోట నుంచి శ్రీసిటీకి మహిళా ఉద‍్యోగులతో వెళుతున‍్న బస్సు బోల్తాపడడంతో 20 మంది గాయపడ్డారు.
శ్రీసిటీలోని సెల్‌ఫోన్ కంపెనీకి మహిళా ఉద్యోగులతో వెళ్తున్న బస్సును విజయవాడ నుంచి నెల్లూరుకు వెళ్తున్న వెంకటరమణ ట్రావెల్స్ వోల్వో బస్సు వెనుక నుంచి ఢీకొంది. దీంతో ఉద్యోగినులు ప్రయాణిస్తున్న బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 18మంది మహిళలు, ఇద్దరు డ్రైవర్లు గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగ్రాత్రులను 108లో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున‍్న పోలీసులు సంఘటన స‍్థలాన్ని పరిశీలించారు.