
షార్ట్ సర్క్యూట్‌తో లారీ దగ్ధం
మండలంలోని కల్లూరుపల్లె గ్రామం చెట్టోళ్లపల్లె అటవీ ప్రాంతంలో ఆగి ఉన్న లారీలో షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు వ్యాపించాయి.
చక్రాయపేట : మండలంలోని కల్లూరుపల్లె గ్రామం చెట్టోళ్లపల్లె అటవీ ప్రాంతంలో ఆగి ఉన్న లారీలో షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు వ్యాపించాయి. డ్రైవర్ అప్రమత్తమై ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందజేశారు. సిబ్బంది సంఘటనా ప్రదేశానికి చేరుకుని మంటలు ఆర్పేలోపే లారీలో చాలా భాగం దగ్ధమైంది. కార్యక్రమంలో ఫైర్‌స్టేషన్ ఎస్‌ఐ గాబ్రేల్, కానిస్టేబుళ్లు ఎస్.వెంకటరమణ, కె.రాంబాబు, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.