బైక్‌లు ఢీ కొని బీటెక్‌ విద్యార్థి దుర్మరణం | btech student died in road accident | Sakshi
Sakshi News home page

బైక్‌లు ఢీ కొని బీటెక్‌ విద్యార్థి దుర్మరణం

Dec 14 2016 1:55 AM | Updated on Jul 10 2019 2:44 PM

రెండు బైక్‌లు ఢీకోనడంతో ఒక ఇంజనీరింగ్‌ విద్యార్ధి దుర్మరణం చెందగా, మరొకరికి గాయాలైన సంఘటన మంగళవారం ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని

ఇబ్రహీంపట్నం: రెండు బైక్‌లు ఢీకోనడంతో ఒక ఇంజనీరింగ్‌ విద్యార్ధి దుర్మరణం చెందగా, మరొకరికి గాయాలైన సంఘటన మంగళవారం ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చింతపల్లిగూడ సమిపంలో చేటుచేసుకుంది. ఎస్‌ఐ నాగరాజు  వివరాల ప్రకారం....మణిసాయిప్రశాంత్, రోహిత్‌సాయిబాలాజీ జాగృతి కళాశాలలో బీటెక్‌  చదువుతున్నారు. ఎదురెదురుగా వస్తున్న వీరి బైక్‌లు ప్రమాదవశాత్తు ఢీకోనడంతో మణిసాయిప్రశాంత్‌(19) అక్కడిక్కక్కడే దుర్మరణం చెందాడు. రోహిత్‌బాలజీకి గాయాలు కావడంతో అస్పతికి తరలించారు. మృతుడు నగరంలోని హైటెక్‌సీటి వివేకానందనగర్‌ కాలనీ చెందినవాడు కాగా, గాయపడ్డ విద్యార్థి చిక్కడపల్లి నివాసి. కేసు దర్యాప్తు జరుపుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement