అయ్యో.. బిడ్డా | boy died in water pit | Sakshi
Sakshi News home page

అయ్యో.. బిడ్డా

Aug 31 2016 9:59 PM | Updated on Jul 12 2019 3:02 PM

బాలుడి మృతదేహం - Sakshi

బాలుడి మృతదేహం

ఓ చిన్నారిని నీటి గుంత బలితీసుకుంది. నిన్నమొన్నటి దాక బాలుడితో కళకళలాడిన ఆ ఇల్లు బుధవారం రాత్రి ముగబోయి రోదనలతో దద్దరిల్లింది.

  • నీటి గుంతలో పడి బాలుడి మృతి
  • అనంతసాగర్‌లో ఘటన
  • జగదేవ్‌పూర్‌: ఓ చిన్నారిని నీటి గుంత బలితీసుకుంది. నిన్నమొన్నటి దాక బాలుడితో కళకళలాడిన ఆ ఇల్లు బుధవారం రాత్రి ముగబోయి రోదనలతో దద్దరిల్లింది. ఉన్న ఒక్కగానొక్క కొడుకు కళ్లముందే మృతి చెందడంతో కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటన బుధవారం రాత్రి  అనంతసాగర్‌లో చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం..

    దండు రామచంద్రం, శోభ దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కూతుళ్లు, ఒక్క కొడుకు రాజు(3) ఉన్నారు. దంపతులు గ్రామంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. పెద్ద కూతురు గ్రామంలో పాఠశాలకు వెళుతుంది. రాజు అంగన్‌వాడి కేంద్రానికి వెళుతున్నారు. అయితే రోజువారిలాగే రాజు ఆట ఆడుతున్న క్రమంలో ఇంటి సమీపంలో ఉన్న గుంతలో పడి మృతి చెందాడు.

    బుధవారం వర్షం పడడంతో గుంతలోకి నీరు వచ్చింది. బాలుడు దుర్మరణంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అయ్యో.. బిడ్డా ఆగం చేసి పోతివా అంటూ కన్నవాళ్ల రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. గుంత గతంలో నల్లా కోసం తీసినట్లు గ్రామస్తులు తెలిపారు. గుంతను పూడ్చకపొవడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement