'ఆంధ్రుల గురించి మాట్లాడే హక్కు లేదు' | Botsa satyanarayana takes on venkaiah naidu | Sakshi
Sakshi News home page

'ఆంధ్రుల గురించి మాట్లాడే హక్కు లేదు'

Mar 16 2016 2:23 PM | Updated on May 29 2018 2:42 PM

'ఆంధ్రుల గురించి మాట్లాడే హక్కు లేదు' - Sakshi

'ఆంధ్రుల గురించి మాట్లాడే హక్కు లేదు'

విశాఖపట్నంలో రైల్వేజోన్ ఏర్పాటుపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.

విశాఖపట్నం : విశాఖపట్నంలో రైల్వేజోన్ ఏర్పాటుపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. లేదంటే ఏప్రిల్ 14వ తేదీన విశాఖ జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని కేంద్రాన్ని హెచ్చరించారు. బుధవారం విశాఖపట్నంలో విలేకర్లతో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ... విశాఖ రైల్వే జోన్పై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేని కేంద్రమంత్రి వెంకయ్యకు ఆంధ్రుల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు.

గోవాడ షుగర్ ఫ్యాక్టరీ గత ప్రభుత్వ హయాంలో లాభాల్లో నడిచేదని బొత్స ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాంటి సంస్థ ప్రస్తుతం రైతులకు రూ. 75 లక్షల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. ఈ నెల 30వ తేదీలోగా రైతులకు బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement