భీమవరంలో భారీ చోరీ | big theft on bhimavaram | Sakshi
Sakshi News home page

భీమవరంలో భారీ చోరీ

Oct 17 2016 1:43 AM | Updated on Sep 4 2017 5:25 PM

భీమవరం టౌన్‌ : భీమవరం టూటౌన్‌ ఆదర్‌్శనగర్‌లోని ఓ ఇంట్లో ఈనెల 15వ తేదీ రాత్రి దొంగలు పడి 58.5 కాసుల బంగారు ఆభరణాలు, రూ.50 వేల నగదు అపహరించినట్టు ఫిర్యాదు అందిందని సీఐ ఎం.రమేష్‌బాబు ఆదివారం తెలిపారు.

భీమవరం టౌన్‌ : భీమవరం టూటౌన్‌ ఆదర్‌్శనగర్‌లోని ఓ ఇంట్లో ఈనెల 15వ తేదీ రాత్రి దొంగలు పడి 58.5 కాసుల బంగారు ఆభరణాలు, రూ.50 వేల నగదు అపహరించినట్టు ఫిర్యాదు అందిందని సీఐ ఎం.రమేష్‌బాబు ఆదివారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఆదర్శనగర్‌కు చెందిన గాదిరాజు శ్రీనివాసరాజు ఈనెల 15న ఉదయం వ్యాపార పనుల నిమిత్తం రాజస్థాన్‌ వెళ్లడంతో ఆయన భార్య కృష్ణకుమారి మధ్యాహ్న సమయంలో శివరావు పేటలోని తన సోదరి ఇంటికి కారులో వెళ్లారు. కారు డ్రైవర్‌ను భోజనం చేసి రమ్మని పంపగా సాయంత్రం 6.30 గంటలకు శ్రీనివాసరాజు ఇంటికి వెళ్లిన డ్రైవర్‌ మొక్కలకు నీళ్లు పోసి కృష్ణకుమారిని తీసుకువచ్చేందుకు శివరావుపేట వెళ్లారు. రాత్రి 7.30 సమయంలో ఆమె కారులో తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఈ సమయంలో కృష్ణకుమారి సోదరుడు జంపన జగపతిరాజు నగదు కోసం వీరి ఇంటికి వచ్చారు. సోదరుడికి నగదు ఇచ్చేందుకు కృష్ణకుమారి అల్మారా వద్దకు వెళ్లి చూస్తే అది తెరిచి ఉంది. లాకర్‌లోని రూ.12 లక్షల విలువైన 58 కాసుల 4 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.50 వేల నగదు చోరీ జరిగినట్టు గుర్తించారు. దీనిపై కృష్ణకుమారి ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదుచేసినట్టు సీఐ రమేష్‌బాబు తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement