బెట్టింగ్‌ వేధింపుల కేసులో ఇద్దరు అరెస్ట్‌ | betting harassment.. culprits arrest | Sakshi
Sakshi News home page

బెట్టింగ్‌ వేధింపుల కేసులో ఇద్దరు అరెస్ట్‌

Sep 13 2016 2:06 AM | Updated on Nov 6 2018 8:04 PM

దేవరపల్లి : బెట్టింగ్‌ వేధింపులకు సంబంధించి నమోదైన కేసులో ఇద్దరు నిందితులను సోమవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు.

దేవరపల్లి : బెట్టింగ్‌ వేధింపులకు సంబంధించి నమోదైన కేసులో ఇద్దరు నిందితులను సోమవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎస్సై చిన్నం ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరపల్లి మండలం యాదవోలులో బెట్టింగ్‌ కాసిన మందపాటి రవిప్రసాద్‌ (18) నిర్వాహకుల వేధింపులతో మనస్తాపం చెంది ఈనెల 2న ఇంటి వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన అంకెం నాగబాలకృష్ణ, కడవకొలను రాజేష్‌ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. రవిప్రసాద్‌ బెట్టింగ్‌లో నిర్వాహకులకు రూ.6,000 బాకీపడ్డాడు. బాకీ కట్టాలంటూ బాలకృష్ణ, రాజేష్‌లు రవిప్రసాద్‌ను వేధించడంతో పాటు సెల్‌ఫోన్‌ లాక్కొని ప్రాంసరీ నోట్‌పై సంతకం పెట్టించుకున్నారు. దీంతో రవిప్రసాద్‌ మనస్తాపానికి గురై ఇంటి వద్ద ఉరివేసుకుని బలవన్మరణం చెందాడు. మృతుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు బాలకృష్ణ, రాజేష్‌ను సోమవారం అరెస్ట్‌ చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement