
భక్తిశ్రద్ధలతో తులసి పూజలు
కడప నగరం చిన్నబెస్తవీధిలోని శ్రీ బాల పోలేరమ్మ ఆలయంలో కార్తీక శుక్రవారం సందర్భంగా అమ్మవారికి తులసి పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
కడప కల్చరల్: కడప నగరం చిన్నబెస్తవీధిలోని శ్రీ బాల పోలేరమ్మ ఆలయంలో కార్తీక శుక్రవారం సందర్భంగా అమ్మవారికి తులసి పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు చంద్రమౌళి ఆధ్వర్యంలో అర్చకులు అమ్మవారికి 500 తులసి మొక్కలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారి సహస్ర నామార్చన చేశారు. అర్చకులు భక్తులకు మంగళహారతులు, తీర్థ ప్రసాదాలు అందజేశారు.