బాసర ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.
బాసర(నిర్మల్):
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం మర్లగడ్డ క్యాంప్‌నకు చెందిన కె. రాధ ట్రిపుల్ ఐటీ నాలుగో సంవత్సరం చదువుకుంటోంది. శుక్రవారం ఉదయం ఆమె హాస్టల్‌లోని తన గదిలో ఉరి వేసుకుంది. మధ్యాహ్నం గమనించిన తోటివారు సిబ్బందికి సమాచారం అందిచారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని బలవన్మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది.