రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్ కారణంగా మంగళవారం సత్యదేవుని ఆలయానికి భక్తులు పెద్దగా రాకపోవడంతో ఆలయ ప్రాంగణం వెలవెలబోయింది.
బోసిపోయిన సత్తెన్న ఆలయం
Aug 2 2016 10:03 PM | Updated on Sep 4 2017 7:30 AM
అన్నవరం :
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్ కారణంగా మంగళవారం సత్యదేవుని ఆలయానికి భక్తులు పెద్దగా రాకపోవడంతో ఆలయ ప్రాంగణం వెలవెలబోయింది. సత్యదేవుని ఆలయానికి వెళ్లే భక్తులు, వారి వాహనాలతో నిత్యం రద్దీగా ఉండే స్వామివారి ఆలయం వెనుక ఉన్న పశ్చిమ రాజగోపురం మంగళవారం సందడి లేకుండా కనిపించింది. నిత్యం వేలాది సంఖ్యలో స్వామివారిని దర్శించుకునే భక్తులు, మంగళవారం మాత్రం వెయ్యి కన్నా తక్కువ సంఖ్యలో దర్శించుకున్నారు. స్వామివారి వ్రతాలు 210 మాత్రమే జరిగాయి. ఆదాయం కూడా రూ.రెండు లక్షలు మాత్రమే వచ్చింది.
Advertisement


