తెలుగు వ్యక్తికి ప్రతిష్టాత్మక అవార్డు | balivada ravi got prestigious awards | Sakshi
Sakshi News home page

తెలుగు వ్యక్తికి ప్రతిష్టాత్మక అవార్డు

Sep 8 2016 3:25 AM | Updated on Sep 4 2017 12:33 PM

తెలుగు వ్యక్తికి ప్రతిష్టాత్మక అవార్డు

తెలుగు వ్యక్తికి ప్రతిష్టాత్మక అవార్డు

బయోమాస్ ఆధారిత ఆయిల్స్ నుంచి డీజిల్‌ను తయారు చేసే పరిజ్ఞానాన్ని కనుగొన్నందుకు తెలుగు వ్యక్తి బలివాడ రవికి జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక అవార్డు లభించింది.

సాక్షి, న్యూఢిల్లీ: బయోమాస్ ఆధారిత ఆయిల్స్ నుంచి  డీజిల్‌ను తయారు చేసే పరిజ్ఞానాన్ని కనుగొన్నందుకు తెలుగు వ్యక్తి బలివాడ రవికి జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. రవి సొంతూరు ఏపీలోని శ్రీకాకుళం జిల్లా సోంపేట. ఈయన ఢిల్లీలోని ఫరీదాబాద్‌లో ఉన్న ఐఓసీ పరిశోధన కేంద్రంలో సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.

రవి ఆవిష్కరించిన  ఈ పరిజ్ఞానానికి ఉత్తమ దేశీయ సాంకేతిక అవార్డును కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ ప్రదానం చేసింది. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో  ఈ అవార్డుతోపాటు రూ.5లక్షల నగదు బహుమతి అందుకున్నారు.  
 

Advertisement

పోల్

Advertisement