దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి అన్నారు.
ఆరోగ్యశ్రీ నిర్వీర్యం
Dec 7 2016 11:43 PM | Updated on Aug 20 2018 4:22 PM
- 9న కలెక్టరేట్ ఎదుట వైఎస్‌ఆర్‌సీపీ ధర్నా
కర్నూలు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ఈనెల 9న ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపడుతున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చిన చంద్రబాబు నిధుల విడుదలను విస్మరించారన్నారు. వైద్య అవసరాలకు రూ.1300 కోట్లు అవసరం కాగా.. రూ.200 కోట్లు మాత్రమే మంజూరు చేస్తే నిరుపేదలకు వైద్యం ఎలా అందుతుందని ఆయన ప్రశ్నించారు. నిరుపేదలకు ఎంతో ఉపయోగకరమైన ఈ పథకాన్ని ప్రభుత్వం క్రమంగా వదిలించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. ఈ నేపథ్యంలో బాబుకు కనువిప్పు కలిగేలా ఈనెల 9న ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొనాలని ఆయన కోరారు.
Advertisement
Advertisement