భీమవరం టౌన్ : ఒక వ్యక్తి అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా మార్చినట్టు భీమవరం వన్‌టౌన్ ఎస్సై కె.సుధాకరరెడ్డి శనివారం తెలిపారు.
హత్య కేసు నమోదు
Aug 7 2016 1:48 AM | Updated on Sep 4 2017 8:09 AM
భీమవరం టౌన్ : ఒక వ్యక్తి అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా మార్చినట్టు భీమవరం వన్‌టౌన్ ఎస్సై కె.సుధాకరరెడ్డి శనివారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఈ నెల 2న అర్ధరాత్రి తాటిపర్తి లక్ష్మణ్ (40) అనే వ్యక్తి కోడవల్లి రోడ్డులోని ఓ కోళ్ల ఫారంలో చోరీకి యత్నించాడు. దీనిని గుర్తించిన నాయుడు ప్రభాకరరావు, కుక్కల సత్యనారాయణ లక్ష్మణ్‌ను వెంబడించి పట్టుకుని తీవ్రంగా కొట్టారు. లక్ష్మణ్ తలను గోడకు వేసి బాదడంతో నరాలు చిట్లిపోయాయి. అనంతరం లక్ష్మణ్‌ను పాలకోడేరు ఆస్పత్రికి తీసుకువెళ్లగా అక్కడ చేర్చుకోలేదు. దీంతో లక్ష్మణ్‌ను ప్రభాకరరావు, సత్యనారాయణ తమతోపాటు తీసుకువెళ్లారు. 3వ తేదీ సాయంత్రం భీమవరం ఏరియా ఆస్పత్రిలో చేర్చి వెళ్లిపోయారు. 4న లక్ష్మణ్ మృతిచెందాడు. మృతుడికి సంబంధించిన వివరాలు తెలియకపోవడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం దీనిని హత్య కేసుగా మార్చి నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కె.సుధాకరరెడ్డి తెలిపారు.
Advertisement
Advertisement