ప్రభుత్వ ఆఫీసు నుంచి ఎగిరొచ్చిన నోట్ల కట్టలు | ACB raids Sub registrar office | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఆఫీసు నుంచి ఎగిరొచ్చిన నోట్ల కట్టలు

Jun 6 2016 7:24 PM | Updated on Aug 17 2018 12:56 PM

మార్కాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి సోమవారం సాయంత్రం నోట్ల కట్టలు బయటకు ఎగిరిపడ్డాయి.

మార్కాపురం (ప్రకాశం జిల్లా) :  మార్కాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి సోమవారం సాయంత్రం నోట్ల కట్టలు బయటకు ఎగిరిపడ్డాయి. తనిఖీలకు వచ్చిన ఏసీబీ బృందాన్ని చూసి కార్యాలయం లోపల ఉన్న సిబ్బంది నోట్ల కట్టలను కిటికీల్లోనుంచి బయటకు విసిరేశారు. అయితే గమనించిన ఏసీబీ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయాన్ని, దస్తావేజు లేఖరుల కార్యాలయాలను తమ స్వాధీనంలోకి తీసుకుని సోదాలు చేపట్టారు. కిటికీల్లోనుంచి బయటకు వచ్చిన నగదు లక్ష వరకు ఉన్నట్టు అధికారులు గుర్తించారు.

Advertisement
 
Advertisement
Advertisement