ఏఎమ్మార్పీ కెనాల్‌లో గల్లంతైన వ్యక్తి మృతి | A person die in AMRP canal | Sakshi
Sakshi News home page

ఏఎమ్మార్పీ కెనాల్‌లో గల్లంతైన వ్యక్తి మృతి

Aug 9 2016 11:21 PM | Updated on Sep 28 2018 3:39 PM

ఏఎమ్మార్పీ కెనాల్‌లో గల్లంతైన వ్యక్తి మృతి - Sakshi

ఏఎమ్మార్పీ కెనాల్‌లో గల్లంతైన వ్యక్తి మృతి

ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వలో ఈత కొట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతైన తిప్పని శ్రీనివాస్‌రెడ్డి (50) మృతిచెందాడు.

పెద్దఅడిశర్లపల్లి
ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వలో ఈత కొట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతైన తిప్పని శ్రీనివాస్‌రెడ్డి (50) మృతిచెందాడు. అతడి మృతదేహం మంగళవారం లభ్యమైంది. సోమవారం సాయంత్రం మండల పరిధిలోని ఘణపురం స్టేజీ సమీపంలో తన స్నేహితులతో కలిసి స్నానం చేసేందుకు కాల్వలోకి దిగిన శ్రీనివాస్‌రెడ్డి నీటి ప్రవాహానికి కొట్టుకుని పోయాడు. గమనించిన స్థానికులు, స్నేహితులు నీటిలోకి దిగి గాలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వెంటనే హుటాహుటీనా గుడిపల్లి పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఏఎమ్మార్పీ గేట్లు తాత్కాలికంగా మూసివేయించారు. అనంతరం గజ ఈతగాళ్లను రంగంలోకి దింపి గాలించగా మృతదేహం లభ్యమైంది. గ పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు గుడిపల్లి ఎస్‌ఐ భోజ్యానాయక్‌ తెలిపారు. కాగా మృతుడు శ్రీనివాస్‌రెడ్డికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.  

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement