భర్త తాగి వస్తున్నాడని.. | a married woman commits suicide Prakasam district | Sakshi
Sakshi News home page

భర్త తాగి వస్తున్నాడని..

Aug 28 2016 6:24 PM | Updated on Nov 6 2018 8:04 PM

భర్త రోజు మద్యం తాగి వస్తున్నాడని మనస్తాపానికి గురైన భార్య వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది.

భర్త రోజు మద్యం తాగి వస్తున్నాడని మనస్తాపానికి గురైన భార్య వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఈ సంఘటన ప్రకాశం జిల్లా దర్శి మండలం చందలూరు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అబ్దుల్లా, మస్తాన్‌బీ(26)లకు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మధ్య మద్యానికి బానిసైన భర్త రోజు తాగి వచ్చి వేధిస్తుండటంతో.. మనస్తాపానికి గురైన మస్తాన్‌బీ వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. 80 శాతం కాలిపోయింది. ఇది గుర్తించిన గ్రామస్థులు ఆమెను చికిత్స నిమిత్తం దర్శి ఆస్పత్రికి తరలించగా.. మెరుగైన చికిత్స కోసం ఒంగోలుకు తరలించాలని వైద్యులు సూచించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement