కామాంధులకు 20 ఏళ్ల కారాగారం | A 20-year prison sentence for rape accused | Sakshi
Sakshi News home page

కామాంధులకు 20 ఏళ్ల కారాగారం

Apr 11 2016 3:34 PM | Updated on Oct 4 2018 8:38 PM

ఓ మహిళపై అత్యాచారం చేసిన ఇద్దరు కామాంధులకు 20 ఏళ్ల కఠిన కారాగారశిక్ష విధిస్తూ చిత్తూరు ఎనిమిదవ అదనపు న్యాయస్థానం జడ్జి చిదానందం సోమవారం తీర్పు చెప్పారు.

ఓ మహిళపై అత్యాచారం చేసిన ఇద్దరు కామాంధులకు 20 ఏళ్ల కఠిన కారాగారశిక్ష విధిస్తూ చిత్తూరు ఎనిమిదవ అదనపు న్యాయస్థానం జడ్జి చిదానందం సోమవారం తీర్పు చెప్పారు. 2013లో చిత్తూరు జిల్లాలోని పెనుమూరు ప్రాంతంలో ఓ మహిళను తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన సంపత్, కాశి బెదిరించి అత్యాచారం చేశారు. ఈ ఘటన తర్వాత బాధితురాలు అవమాన భారంతో ఆత్మహత్య చేసుకుంది. నిందితులను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేసిన పోలీసులు వారిని న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. నేరారోపణలు రుజువు కావడంతో శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement