52 మంది విద్యార్థులు గైర్హాజరు | 52 students absent of practical exams | Sakshi
Sakshi News home page

52 మంది విద్యార్థులు గైర్హాజరు

Feb 5 2017 11:16 PM | Updated on Sep 5 2017 2:58 AM

జిల్లాలో ఆదివారం జరిగిన ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలకు 52 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.

అనంతపురం ఎడ్యుకేషన్‌ : జిల్లాలో ఆదివారం జరిగిన ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలకు  52 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం జరిగిన పరీక్షలకు 1519 మంది విద్యార్థులకు గాను 27 మంది గైర్హాజరయ్యారు. 1492 పరీక్షలు రాశారు. అలాగే మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు  1480 మందికి గాను 1455 మంది హాజరయ్యారు. 25 గైర్హాజరయ్యారు.

ఆర్‌ఐఓ వెంకటేశులు, డీఈసీ మెంబర్లు ఆరు కేంద్రాలను తనిఖీలు చేశారు. నగరంలోని గాయత్రి సాయి యశ్వంత్‌ కళాశాల కేంద్రంలో జరిగిన ప్రయోగ పరీక్షలకు ఒక సిలిండర్‌ మాత్రమే ఉంది.దీంతో విద్యార్థులంతా ఒకేచోట గ్రూపుగా చేరి ఇబ్బందులు పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. రెండో సిలిండర్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించగా యాజమాన్యం స్పదించి చర్యలు తీసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement