400 కేజీల గంజాయి స్వాధీనం | 400 KG ganja seized in vizag district | Sakshi
Sakshi News home page

400 కేజీల గంజాయి స్వాధీనం

Aug 14 2016 11:22 AM | Updated on Sep 4 2017 9:17 AM

విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం కె.కోడపల్లి వద్ద ఎక్సైజ్ పోలీసులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు.

విశాఖపట్నం: విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం కె.కోడపల్లి వద్ద ఎక్సైజ్ పోలీసులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న 400 కేజీల గంజాయిని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి నలుగురు వ్యక్తులతోపాటు మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించి....విచారిస్తున్నారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement