మహిళ హత్యకేసులో ముగ్గురి అరెస్ట్ | 3 arrested in women murder case in medak district | Sakshi
Sakshi News home page

మహిళ హత్యకేసులో ముగ్గురి అరెస్ట్

May 24 2016 4:47 PM | Updated on Oct 16 2018 3:12 PM

మెదక్ జిల్లా వర్గల్ మండలం మీనాజీపేటలోని అటవీ ప్రాంతంలో ఈ నెల 3న హత్యకు గురైన బాలామణి కేసు మిస్టరీ వీడింది.

హైదరాబాద్‌: మెదక్ జిల్లా వర్గల్ మండలం మీనాజీపేటలోని అటవీ ప్రాంతంలో ఈ నెల 3న హత్యకు గురైన బాలామణి కేసు మిస్టరీ వీడింది. ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేసి గజ్వేల్‌లో మీడియా ముందు ప్రవేశపెట్టారు. మే 3న తూప్రాన్‌కు చెందిన అర్కల రాజు, గొల్లెం లక్ష్మి, దుర్గం ఇందిర, బాలామణీలు మీనాజీపేటలో మద్యం సేవించారు. మిగతా ముగ్గురు బాలామణిని చంపి ఆమె ఒంటిపై ఉన్న నగలను, సెల్‌ఫోన్‌ను తీసుకుని పరారయ్యారు. బాలామణి బంధువులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement