16వ రోజు @ 824మంది | 16 @ 824 persons day | Sakshi
Sakshi News home page

16వ రోజు @ 824మంది

Aug 3 2016 12:11 AM | Updated on Sep 4 2017 7:30 AM

అభ్యర్థుల పరుగుపందెం

అభ్యర్థుల పరుగుపందెం

పోలీస్‌ కానిస్టేబుల్‌ ఎంపికల్లో భాగంగా ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఖమ్మంలో నిర్వహిస్తున్న శారీరక సామర్థ్య పరీక్షలు 16వ రోజైన మంగళవారం కొనసాగాయి.

  • కొనసాగిన కానిస్టేబుల్‌ శారీరక దారుఢ్య పరీక్షలు
  •  
    ఖమ్మంక్రైం: పోలీస్‌ కానిస్టేబుల్‌ ఎంపికల్లో భాగంగా ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఖమ్మంలో నిర్వహిస్తున్న శారీరక సామర్థ్య పరీక్షలు 16వ రోజైన మంగళవారం కొనసాగాయి. స్థానిక పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఎస్పీ షానవాజ్‌ఖాసీం పర్యవేక్షణలో ప్రక్రియను నిర్వహించారు. మొత్తం 1200మంది అభ్యర్థులకు గాను 824మంది హాజరయ్యారు. బయోమెట్రిక్, అభ్యర్థుల ఆదార్‌కార్డు, సర్టిఫికెట్లను పరిశీలించి, ఎత్తులో అర్హత సాధించిన వారిని 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్, షార్ట్‌పుట్‌ పోటీలకు అనుమతించారు. మహిళా అభ్యర్థులకు ప్రత్యేకంగా ఈవెంట్లను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్‌బ్రాంచి డీఎస్పీ అశోక్‌కుమార్, డీఎస్పీలు రాంరెడ్డి, నరేందర్‌రావు, వీరేశ్వరరావు, సాయిశ్రీ, సురేష్‌కుమార్, రాజేష్, ఏఆర్‌ డీఎస్పీలు సంజీవ్, మాణిక్‌రాజ్, ఫిజికల్‌ డైరెక్టర్లు, పీఈటీలు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
     

Advertisement
 
Advertisement
Advertisement