తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది.
	హైదరాబాద్: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. సర్వ దర్శనానికి 12 గంటల సమయం పట్టనుంది. ప్రస్తుతం 18  కంపార్టమెంట్లలో భక్తులు వెంకన్న దర్శనం కోసం వేచి ఉన్నారు. కాగా  కాలినడక భక్తులకు ప్రవేశం రద్దు చేశారు.  ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని కూడా రద్దు చేసినట్టు టీటీడీ అధికారులు తెలిపారు.
	 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
