అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య  | Youth Commits Suicide In Parigi Ranga Reddy | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య 

Oct 10 2018 11:33 AM | Updated on Nov 6 2018 8:08 PM

Youth Commits Suicide In Parigi Ranga Reddy - Sakshi

సంతోష్‌ మృతదేహం సంతోష్‌ (ఫైల్‌)

సాక్షి, పరిగి (రంగారెడ్డి): అప్పుల బాధతో చె ట్టుకు ఉరివేసికుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పరిగి మండల పరిధిలోని నజిరాబాద్‌తండాలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసు లు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. నజిరాబాద్‌తండాకు చెందిన కాళ్యానాయక్‌కు నలుగురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. కుమారుడు సంతోష్‌ (22) డిగ్రీ మధ్యలో ఆపి త్రండికి తోడు గా ఇంటి పనులు చూసుకుంటున్నాడు. ఇద్దరు అక్కల వివాహం కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.

ఇటీవల ఆర్థిక ఇబ్బందులు మరింత ఎక్కువయ్యాయి. దీంతో మంగళవారం తెల్లవారు జాము న సంతోష్‌ పొలానికి వెళ్లి చింతచెట్టుకు ఉరివేసు కుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉద యం చింతకాయలు కోసేందుకు పొలానికి వెళ్లిన తండా  యువకులు సంతోష్‌ చెట్టుకు వేలాడుతుండటాన్ని చూసి పరుగున వెళ్లి కుటుంబీకులకు సమాచారం అందించారు. కుటుంబీకులు వచ్చి చూడగా అప్పటికే మృతిచెందాడు. మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అందజేశారు. మృతుడి తండ్రి కాళ్యానాయక్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement