అప్పు తీసుకున్న వ్యక్తి మోసం చేశాడని.. | Young Man Committed Suicide In Vijayawada | Sakshi
Sakshi News home page

అప్పు తీసుకున్న వ్యక్తి మోసం చేశాడని..

Jul 24 2019 10:32 AM | Updated on Jul 24 2019 10:32 AM

Young Man Committed Suicide In Vijayawada - Sakshi

డబ్బులు ఇచ్చినట్లు ఆధారాలు ఉంటే చూపించాలని కోరారు. దీంతో అతను..

సాక్షి, విజయవాడ : అప్పు తీసుకున్న వ్యక్తి మోసం చేశాడని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. విజయవాడలోని చిట్టినగర్‌ చెందిన యాసిన్‌ అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి కొంత డబ్బును అప్పుగా ఇచ్చారు. స్నేహితుడు కావడంతో ప్రామిసరీ నోటు లేకుండానే అతనికి డబ్బులు ఇచ్చారు. కొద్ది రోజుల తర్వాత తన డబ్బులు ఇవ్వమని యాసిన్‌ అడగ్గా.. ఎప్పుడు ఇచ్చావని తిరిగి ప్రశ్నించారు. డబ్బులు ఇచ్చినట్లు ఆధారాలు ఉంటే చూపించాలని కోరారు. దీంతో అతను తనన్ని మోసం చేశాడని మనస్థాపం చెందిన యాసిన్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు. డబ్బులు ఇచ్చిన వ్యక్తి మోసం చేయడం వల్లే చనిపోతున్నట్లు సూసైడ్‌ లెటర్‌ రాసి గాంధీనగర్‌ లాడ్జీలో ఆత్మహత్య చేసుకున్నారు. తన శవాన్ని ఆధారంగా చేసుకొని బాధ్యుడిపై చర్యలు తీసుకొవాలని సూసైడ్‌ నోట్‌లో రాశాడు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement