ప్రపంచ ప్రఖ్యాత గొరిల్లాను చంపిన వేటగాళ్లు

World Most Famous Gorilla Mudered By Poachers In Uganda - Sakshi

కంపాలా : ప్రపంచ ప్రఖ్యాత సిల్వర్‌ బ్యాక్‌ గొరిల్లా వేటగాళ్ల చేతుల్లో మృత్యువాతపడింది. ఈ సంఘటన ఉగాండాలోని బ్విండి ఇంపినిట్రేబుల్‌ నేషనల్‌ పార్కులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రఫికి అనే ప్రపంచ ప్రఖ్యాత సిల్వర్‌ బ్యాక్‌ గొరిల్లా ఉగాండా బ్విండి ఇంపినిట్రేబుల్‌ నేషనల్‌ ఉంటోంది. 25ఏళ్ల ఈ మగ గొరిల్లా ప్రమాదంలో పడ్డ కొండ జాతి గొరిల్లాల గ్రూపునకు నాయకుడు. కొద్దిరోజుల క్రితం నలుగురు వేటగాళ్లు రఫికిని చంపేసినట్లు ఉగాండా వైల్డ్‌లైఫ్‌ అథారిటీ అధికారులు ప్రకటించారు. దారుణానికి పాల్పడ్డ నలుగురిలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అయితే ఆత్మరక్షణ కోసమే గొరిల్లాను చంపేసినట్లు పోలీసుల అదుపులో ఉన్న బయామికామా ఫెలిక్స్‌ అనే వేటగాడు అంగీకరించాడు. రఫికిని చంపిన కేసులో ఆ నలుగురు వేటగాళ్లకు జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. ( గాళ్‌ఫ్రెండ్‌ ప్రేమను ఒప్పుకుందేమో అందుకే..)

పోలీసుల అదుపులోని వేటగాడు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top