మాయా లేడీల ఆటకట్టు

Women Thievs Arrest in Gold Robbery Case - Sakshi

ప్రయాణికుల దృష్టి మరల్చి బ్యాగుల చోరీలు

నలుగురు మహిళల రిమాండ్‌

45 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం

అడ్డగుట్ట: రైల్వే స్టేషన్లు, రైళ్లలో ప్రయాణికుల దృష్టి మరల్చి బ్యాగుల చోరీలకు పాల్పడుతున్న నలుగురు మహిళలను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన సికింద్రాబాద్‌ జీఆర్‌పీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే ఎస్పీ అశోక్‌ కుమార్‌ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి...సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్‌లు, రైళ్లలో గత కొంత కాలంగా వరుస బ్యాగు చోరీలు జరుగుతున్నాయి.  ప్రయాణికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు ముమ్మర తనిఖీలు చేపట్టారు. సోమవారం ప్లాట్‌ఫాం నం.1లోని బుకింగ్‌ ఎంట్రెన్స్‌ గేట్‌  వద్ద ప్రయాణికుల బ్యాగుల చోరీకి పాల్పడుతున్న  నలుగురు మహిళలను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.  

వీరు కర్నాటక రాష్ట్రం, బద్రావతికి చెందిన  బోయ దుర్గమ్మ, బర్రె శారద,  జ్యోతి, బడిగ భాగ్యలుగా గుర్తించినట్లు తెలిపారు.   గార్మెంట్స్‌ కంపెనీలో పని చేస్తున్న వీరు సులువుగా డబ్బులు సంపాదించాలనే యోచనతో ప్రయాణికుల దృష్టి మరల్చి వారి బ్యాగుల చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. వారి నుంచి రూ. 14.50 లక్షల విలువైన 45 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించారు. అపరిచితుల వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా తినుబండారాలు ఇస్తే తీసుకోవద్దని రైల్వే ఎస్పీ అశోక్‌ కుమార్‌ సూచించారు. సమావేశంలో  రైల్వే డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్, ఇన్‌స్పెక్టర్‌ ఆదిరెడ్డి, ఎస్‌ఐ ప్రమోద్‌ కుమార్, రాజ్‌ గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top