19 ఏళ్ల యువకునితో మహిళ పరారు | Women Escape With Young Teenage Boy in Karnataka | Sakshi
Sakshi News home page

యువకునితో మహిళ పరారు

Mar 5 2020 7:53 AM | Updated on Mar 5 2020 7:53 AM

Women Escape With Young Teenage Boy in Karnataka - Sakshi

అదృశ్యమైన నరేష్, నిందితురాలు చంద్రిక

కర్ణాటక, రాయచూరు రూరల్‌: ప్రేమ పేరుతో 19 ఏళ్ల యువకున్ని 45 ఏళ్ల మహిళ కిడ్నాప్‌ చేసినట్లు యువకుని తల్లి ఆరోపిస్తున్నారు. ఈ  ఉదంతం రాయచూరులో చోటు చేసుకుంది.  ఫిర్యాదిదారు నిర్మల ఆటో డ్రైవర్‌గా పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుండేది. నిర్మల కుమారుడు నరేష్‌ (19) మహబళేశ్వర సర్కిల్‌ వద్ద గల ఉడుపి హోటల్‌లో పని చేసేవాడు. అదే హోటల్‌లో చంద్రిక (45) అనే మహిళ కూడా పనిచేసేది  చంద్రిక తన కొడుక్కి మాయమాటలు చెప్పి గత వారం రోజుల క్రితం ఎక్కడికో తీసుకెళ్లిందని, తన కొడుకు జాడ లేదని నిర్మల విలపిస్తోంది. ఈ మేరకు బుధవారం పోలీసులకు పిర్యాదు చేసింది.  చంద్రికకు ముగ్గురు పిల్లలున్నారని, ఆమె భర్త లోకేష్‌ ఈ విషయంలో తనకేమీ తెలియదని చెబుతున్నాడని ఫిర్యాదులో తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement