రెండో పెళ్లి చేసుకుని మోసగించాడని.. | woman suicide | Sakshi
Sakshi News home page

Dec 25 2017 12:11 PM | Updated on Nov 6 2018 8:22 PM

woman suicide - Sakshi

సాక్షి, పులివెందుల: సూర్యమోహన్‌ అనే వ్యక్తి తనను రెండో పెళ్లి చేసుకుని మోసగించాడనే ఆవేదనతో వైఎస్సార్‌జిల్లా పులివెందుల మండలం చిన్న రంగాపురానికి చెందిన విజయలక్ష్మి ఆత్మహత్య చేసుకుంది. ఈమె కడప ఎర్రముక్కపల్లెలోని బాలవికాస్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. రెండు రోజుల క్రితం యాసిడ్‌ వంటి ద్రావణం తాగగా తిరుపతిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆత్మహత్యాయత్నం చేసేముందు ఆమె సూసైడ్‌ నోట్‌ రాసింది. విజయలక్ష్మి మృతదేహాన్ని ఆమె కుటుంబీకులు పులివెందులకు సోమవారం తీసుకొచ్చారు. సూర్యమోహన్ కారణంగానే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని విజయలక్ష్మి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాగా, సూర్యమోహన్‌ మైదుకూరు మునిసిపల్ ఆపిసులో మేనేజర్గా పనిచేసి పులివెందులకు మున్సిపల్ కమిషనర్గా బదిలీపై వెళ్లారు. అక్కడ ఈ ఏడాది జనవరిలో ఏసీబీకి పట్టుబడి సస్పెండయ్యారు. 

వైఎస్సార్‌ జిల్లాలో టీచర్‌ ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement