రెప్పపాటులో ఘోరం 

Woman Killed In Road Accident - Sakshi

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు  

భర్త కళ్లెదుటే భార్య దుర్మరణం 

గాయాలతో బయటపడిన తండ్రీకూతురు 

పెద్దకర్మకు వెళ్లి వస్తుండగా ప్రమాదం 

చోడవరం/మాడుగుల: చోడవరం పెట్రోల్‌ బంకు వద్ద సంభవించిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. మాడుగుల మండలం ఎం.కోడూరుకు చెందిన కోనేటి జగదీష్‌ తన భార్య నూకరత్నం(30), నాలుగేళ్ల కుమార్తెతో కలిసి స్కూటర్‌పై లంకెలపాలెంలో తన బంధువుల ఇంట్లో జరిగిన పెద్దకర్మ కార్యక్రమానికి బుధవారం ఉదయం వెళ్లారు. అనంతరం తిరిగి స్వగ్రామానికి ముగ్గురూ స్కూటర్‌పై తిరుగు పయనమయ్యారు. బీఎన్‌ రోడ్డుపై చోడవరం ఊర్లోని పెట్రోల్‌ బంకు వద్దకు వచ్చే సరికి వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు వీరి వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో స్కూటర్‌పై వెనుక కూర్చున్న నూకరత్నం రోడ్డుపై పడింది. స్కూటర్‌ నడుపుతున్న జగదీష్‌ తన ముందు కూర్చున్న కుమార్తెను పట్టుకొని రోడ్డు పక్కన ఎడమ వైపునకు పడిపోయారు.

రోడ్డుపై పడిపోయిన నూకతర్నం తలపై నుంచి బస్సు వెనుక చక్రం ఎక్కేయడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. జగదీష్, కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. కళ్లెదుటే భార్య చనిపోవడంతో జగదీష్‌ కన్నీటి పర్యంతమయ్యాడు. రక్తపుమడుగులో పడి ఉన్న నూకరత్నం మృతదేహాన్ని చూసి రోదించిన తీరు అక్కడి వారిని శోకసముద్రంలో ముంచెత్తింది. చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు స్థానికులు ఎంత ప్రయతి్నంచినా రోడ్డుపై విగతజీవిగా పడి ఉన్న భార్య మృతదేహం వద్దే కుప్పకూలిపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వచ్చి నూకరత్నం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చోడవరం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన జగదీష్, అతని కుమార్తెకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందించారు. బస్సు డ్రైవర్‌ ప్రమాదం జరిగిన వెంటనే చోడవరం పోలీసు స్టేషన్‌కు వెళ్లి సమాచారమిచ్చాడు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top