కట్నం కోసం ఆగిన పెళ్లి..

Woman Doctor Complaint Extra Dowry Case on Police DSP Son - Sakshi

మాజీ డీఎస్పీ కుమారుడిపై మహిళా డాక్టర్‌ ఫిర్యాదు

ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన

చెన్నై,టీ.నగర్‌: కట్నంగా రూ.50 లక్షల నగదు, రూ.3.5 కోట్ల విలువైన ఇంటిని రాసివ్వాలంటూ వివాహం నిలిపిన రిటైర్డ్‌ డీఎస్పీ కుమారుడిపై మహిళా డాక్టర్‌ పోలీసులకు అన్నానగర్‌లో ఫిర్యాదు చేసింది. వివరాలు.. చెన్నై అన్నానగర్‌ వెస్ట్‌ ప్రాంతంలో సుమతి (30) నివసిస్తున్నారు. ఈమె అదే ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో డాక్టర్‌గా పని చేస్తున్నారు. మరైమలైనగర్‌కు చెందిన రిటైర్డ్‌ డీఎస్పీ బాలసుబ్రమణియం కుమారుడు బాలమురళీధరన్‌ (32). ఇతను నుంగంబాక్కంలోని ఇన్‌కంటాక్స్‌ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్‌గా పని చేస్తున్నారు. గత జూన్‌ 27వ తేదీన ఇరుకుటుంబాల సమ్మతితో సుమతికి బాలమురళీధరన్‌కు పెద్దల సమక్షంలో వివాహం నిశ్చయించారు. ఆ సమయంలో వరకట్నంగా రూ.50 లక్షలు, రూ.3.5 కోట్ల విలువైన సుమతి కుటుంబీకులకు సొంతమైన ఇంటిని అందచేయనున్నట్లు నిర్ణయించి..  నవంబర్‌ 29వ తేదీన వివాహం ఏర్పాటుకు సమ్మతించారు.

వరకట్నం సొమ్ము రూ.50 లక్షలలో కారు తీసుకోవచ్చునని మాట్లాడారు. దీంతో వివాహ ఏర్పాట్లు వేగంగా సాగాయి. వివాహ ఆహ్వాన పత్రికలు ముద్రించి బంధువులకు అందజేస్తూ వచ్చారు. ఇలా ఉండగా ఒకరోజు పట్టుచీర కొనుగోలు చేయాలని వధువు ఇంటి వారిని వరుడు ఇంటివారు తీసుకెళ్లారు. ఆ సమయంలో పట్టుచీర ధర రూ.లక్షను, వధువు ఇంటి వారే చెల్లించారు. రోజులు సమీపిస్తుండగా వరకట్నంగా మాట్లాడిన రూ.50 లక్షలను ముందుగానే అందజేయాలని, రూ.3.5 కోట్ల విలువైన ఇంటిని రాసివ్వాలని వరుడు ఇంటి వారు డిమాండ్‌ చేశారు. వేరే గత్యంతరం లేకుండా కారు కొనుగోలుకు రూ. 10 లక్షలను వధువు ఇంటి వారు చెల్లించారు. ఆ సమయంలో వరకట్నం సొమ్మును పూర్తిగా చెల్లించాలని వరుడు ఇంటి వారు కోరారు. దీంతో విరక్తి చెందిన వధువు ఇంటి వారు దీని గురించి తిరుమంగళం మహిళా పోలీసుస్టేషన్‌లో సెప్టెంబర్‌ 7వ తేదీన ఫిర్యాదు చేశారు. దీంతో వరుడు ఇంటి వారిని విచారణ కోసం పోలీసులు పిలిపించగా వారు రాలేదు. సుమతి పోలీసుస్టేషన్‌కు వెళ్లి చర్యలు తీసుకోవలసింది గా కోరుతూ వచ్చింది. అలాగే చెన్నై పోలీసు కమిషనర్‌ కార్యాలయంలోనూ బాధితులు ఫి ర్యాదు చేశారు. దీనిపై విచారణ జరపాల్సిం దిగా తిరుమంగళం మహిళా పోలీసులకు ఉత్తర్వులు అందాయి. ఇన్‌స్పెక్టర్‌ ధనలక్ష్మి కేసు న మోదు చేసి మళ్లీ వరుడి ఇంటివారిని సోమవా రం విచారణకు రమ్మని పిలిచారు. అయినప్పటికీ వారు కాలయాపన చేస్తున్నారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో సంచలనం కలిగించింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top