
భువనేశ్వర్ : ఒడిశాలో దారుణ చోటు చేసుకుంది. ప్రియుడి మర్మాంగాన్ని ఓ మహిళ కత్తితో కత్తిరించిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్ర నాయక్(25), ఓ మహిళ(24) ఇరువురు కియోంజర్ జిల్లాలో బదువాగాన్ గ్రామంలో నివసిస్తున్నారు. గత కొద్ది కాలంగా ఇరువురు మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది.
రాజేంద్ర నాయక్ చెన్నైలో ఉద్యోగం చేస్తూ ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. ఇలా ఇంటికి వచ్చినప్పుడల్లా మహిళను ఆమె ఇంట్లో కలుస్తుండేవాడు. కాగా గత మంగళవారం నాయక్ చెన్నై నుంచి తన సొంత గ్రామానికి వచ్చాడు. ఆ తరువాతి రోజు రాత్రి నాయక్ ఆ మహిళను కలిసేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
అనంతరం నాయక్ అక్కడే పడుకున్నాడు. అర్థరాత్రి దాటాక నిద్రలో ఉన్న నాయక్‌పై మహిళ దాడి చేశారు. ఓ పదునైన కత్తితో నాయక్ మర్మాంగాన్ని కత్తిరించారు. అతిన అరుపులు విని చూట్టుపక్కల వారు వచ్చి ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని మహిళను అరెస్ట్ చేశామని పోలీసులు పేర్కొన్నారు.