వంట బాగా చేయలేదన్నాడని.. | Woman Commits Suicide in Vikarabad District | Sakshi
Sakshi News home page

వంట బాగా చేయలేదన్నాడని..

Nov 8 2019 5:52 AM | Updated on Nov 8 2019 9:19 AM

Woman Commits Suicide in Vikarabad District - Sakshi

అనంతగిరి: వంట బాగా చేయడంలేదని భర్త అనడంతో మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వికారాబాద్‌ జిల్లా కేంద్రంలోని కామారెడ్డిగూడకు చెందిన రాఘవేంద్రచారికి కర్ణాటకలోని సేడం తాలూకా ఆర్కి గ్రామానికి చెందిన కవితతో రెండేళ్ల కిందట వివాహమైంది. ఈనెల 1న భర్త ‘నీవు వంట బాగా చేస్తలేదు’అని భార్యకు చెప్పాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె మరుసటి రోజు తెల్లవారుజామున ఇంట్లోనే కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. గమనించిన కుటుంబసభ్యులు కవితను చికిత్స నిమిత్తం వికారాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు ఎస్‌.ఐ లక్ష్మయ్య తెలిపారు. మృతురాలు కవిత 45 రోజుల కిందట మగబిడ్డకు జన్మనిచ్చింది. వీరి వివాహమై రెండేళ్లవుతోంది. భార్యాభర్తలు బాగానే సంసారం చేస్తున్నారని, దసరా పండుగ నుంచి కవిత మానసిక స్థితి సరిగా లేదని తల్లిదండ్రులు, ఆమె బంధువులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం పోలీసులు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.

Advertisement
 
Advertisement
Advertisement