ఫేస్‌బుక్‌ తెచ్చిన తంటా! భర్తపై భార్య కత్తితో దాడి | Wife Knife Attack On Husband In Tamil nadu | Sakshi
Sakshi News home page

భర్తపై భార్య కత్తితో దాడి

Sep 26 2018 12:08 PM | Updated on Sep 26 2018 12:08 PM

Wife Knife Attack On Husband In Tamil nadu - Sakshi

ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తి తన ఇంట్లో భార్యతో ఉండడాన్ని భర్త గమనించడంతో

చెన్నై ,టీ.నగర్‌: ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తి తన ఇంట్లో భార్యతో ఉండడాన్ని భర్త గమనించడంతో భార్య అతనిపై కత్తితో దాడి చేసింది. ఈ సంఘటన చెన్నై కీల్పాక్కంలో మంగళవారం చోటుచేసుకుంది. చెన్నై పెరుమాళ్‌ వీధికి చెందిన కిషోర్‌కోథారి (40) వేపేరి కాలదియప్ప వీధిలో ద్విచక్రవాహనాలకు ఫైనాన్స్‌ చేస్తుంటారు. రాజస్తాన్‌కు చెందిన ఇతనికి సీమా (28)తో గత ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి సంతానం లేదు. వీరితో మూడు నెలలుగా సీమా చెల్లెలు బేబి (18) నివశిస్తున్నారు. సీమా, బేబిలకు రాజస్థాన్‌కు చెందిన రవిప్రకాష్‌ (19) మూడు నెలల క్రితం ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమయ్యాడు.

మూడు రోజుల క్రితం రవిప్రకాష్‌ రాజస్థాన్‌ నుంచి చెన్నై చేరుకున్నారు. కిషోర్‌కొథారి బయటికి వెళ్లగానే అతని ఇంటికి వచ్చి అక్కచెళ్లెళ్లతో మాట్లాడేవాడు. మంగళవారం రవిప్రకాష్‌ కిషోర్‌ ఇంటికి వచ్చాడు. అయితే కిషోర్‌ 11 గంటల సమయంలో హఠాత్తుగా ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో భార్యతో రవిప్రకాష్‌ ఉండడం చూసి కిషోర్‌ ఆగ్రహించాడు. దీంతో వారిమధ్య వాగ్వాదం ఏర్పడింది. ఆగ్రహించిన సీమా వంటింట్లోని కత్తి తీసుకుని భర్త కిషోర్‌పై దాడి చేసింది. దీనిపై కీల్పాక్కం పోలీసులకు సమాచారం అందడంతో వారు అక్కడికి చేరుకుని గాయపడిన కిషోర్‌ను ఆస్పత్రిలో చేర్చారు. ఈ కేసుకు సంబంధించి సీమా, బేబి, రవిప్రకాష్‌ వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement