టీఆర్‌ఎస్‌ నేత దారుణ హత్య | TRS Leader Narayana Reddy Murdered In Vikarabad | Sakshi
Sakshi News home page

Nov 6 2018 9:31 AM | Updated on Nov 6 2018 4:50 PM

TRS Leader Narayana Reddy Murdered In Vikarabad - Sakshi

వికారాబాద్జిల్లాలోని పరిగి మండలం సుల్తాన్‌పూర్‌లో దారుణం చోటు చేసుకుంది.

సాక్షి, వికారాబాద్ ‌: జిల్లాలోని పరిగి మండలం సుల్తాన్‌పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. టీఆర్‌ఎస్‌ నాయకుడు నారాయణ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం ఉదయం రాళ్లతో దాడి చేసి హత్య చేశారు. నారాయణ రెడ్డి వర్గానికి, గ్రామంలోని ఓ సామాజిక వర్గానికి గత కొంత కాలంగా గొడవలు ఉన్నాయి. గతంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇరువర్గాలపై కూడా పోలీసు కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రత్యర్థులే నారాయణ రెడ్డిని హత్య చేసివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

నారాయణ రెడ్డి హత్యతో సుల్తాన్‌పూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కాంగ్రెస్ నాయకులపై ఆయన వర్గీయులు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ నేత నారాయణ రెడ్డి దారుణ హత్యతో సుల్తాన్‌పూర్‌ గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

Advertisement
 
Advertisement
Advertisement