భవనంపై నుంచి దూకిన ట్రిపుల్ ఐటీ విద్యార్థి  | triple it student suside attempt | Sakshi
Sakshi News home page

భవనంపై నుంచి దూకిన ట్రిపుల్ ఐటీ విద్యార్థి 

Dec 21 2017 2:14 PM | Updated on Jun 2 2018 2:56 PM

సాక్షి, మచిలీపట్టణం: కృష్ణా జిల్లా నూజివీడు పట‍్టణంలో ఉన‍్న ట్రిపుల్ ఐటీలో గురువారం ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గోపిచంద్‌ నాయక్‌ అనే విద్యార్థి భవనంపై నుంచి దూకాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గోపిచంద్ నాయక్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement