కత్తి మహేశ్‌ బహిష్కరణపై హైకోర్టులో విచారణ | Trial In The High Court Regarding Expulsion Of Kathi Mahesh Case | Sakshi
Sakshi News home page

కత్తి మహేశ్‌ బహిష్కరణపై హైకోర్టులో విచారణ

Aug 16 2018 3:35 PM | Updated on Sep 4 2018 5:53 PM

Trial In The High Court Regarding Expulsion Of Kathi Mahesh Case - Sakshi

ప్రముఖ సినీ విశ్లేషకులు కత్తి మహేశ్‌(పాత చిత్రం)

విచారణ చేపట్టిన హైకోర్టు కౌంటర్‌ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది

హైదరాబాద్‌: ప్రముఖ సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్‌ బహిష్కరణ పిటిషన్ గురువారం హైకోర్టులో విచారణకు వచ్చింది. నగర బహిష్కరణను సవాలు చేస్తూ కత్తి మహేశ్‌ గతంలో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెల్సిందే. తనపై ఉన్న నగర బహిష్కరణను ఎత్తి వేయాలంటూ పిటిషన్‌లో కత్తి మహేశ్‌ పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు కౌంటర్‌ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో కౌంటర్‌ దాఖలు చేయడానికి ప్రభుత్వం తరపు న్యాయవాది 10 రోజుల సమయం కావాలని కోరారు. దీనికి సమ్మతించిన హైకోర్టు కేసును ఈ నెల 27కు వాయిదా వేసింది.

Advertisement
 
Advertisement
Advertisement