చెత్తవ్యానును ఢీకొన్న ఎన్టీపీసీ రైలు  | Train hits van at level crossing | Sakshi
Sakshi News home page

చెత్తవ్యానును ఢీకొన్న ఎన్టీపీసీ రైలు 

Mar 31 2018 11:08 AM | Updated on Apr 3 2019 8:03 PM

Train hits van at level crossing - Sakshi

దెబ్బతిన్న చెత్త తరలించే వ్యాను  

యైటింక్లయిన్‌కాలనీ(గోదావరిఖని): రామగుండం కార్పొరేషన్‌ 43వ డివిజన్‌లోని చెత్తను రైల్వేట్రాక్‌ దాటి డంపింగ్‌ చేసి వస్తున్న క్రమంలో శుక్రవారం ఎన్టీపీసీకి బొగ్గు రవాణా చేస్తున్న రైలు ఢీకొంది. ఈసంఘటనలో ఎవరికీ ఏలాంటి గాయాలు కాలేదు. ఎప్పటిలాగే చెత్తను డంపింగ్‌చేసేందుకు ట్రాక్‌ దాటి వెళ్లిన వ్యాను తిరిగి ట్రాక్‌ దాటుతుండగా  నిలిచిపోయింది. దీంతో బొగ్గు లోడ్‌తో వస్తున్న ఎన్టీపీసీ రైలు ఢీకొంది. పక్కన రెయిల్‌ ఉండటంతో దాన్ని ఆనుకుని వ్యాన్‌ నిలిచిపోయింది. లేకంటే కట్టపైనుంచి కిందపడే ప్రమాదముండేంది.

Advertisement
 
Advertisement
Advertisement