
ప్రతీకాత్మక చిత్రం
గుంటూరు: చిలకలూరిపేట మండలం తాతపూడి దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, అతివేగంతో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తోన్న ఐదుగురు అయ్యప్ప భక్తుల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన వారిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.