నాటుసారా తరలిస్తున్న టీడీపీ నేత అరెస్ట్‌

TDP Leader Arrested For Moving Illegal Alcohol In Kakinada - Sakshi

సాక్షి, కాకినాడ : సముద్రం మీదుగా బోటులో నాటుసారా తరలిస్తుండగా నేమాంకు చెందిన టీడీపీ నేత మేడిశెట్టి బుజ్జి ఎక్సైజ్‌ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ నేపథ్యంలో బుజ్జి నుంచి పెద్ద ఎత్తున సారాయి, బోటు, ఆటోను స్వాధీనం పరుచుకున్నట్లు ఎక్సైజ్‌ సిబ్బంది వెల్లడించింది. కాకినాడకి చెందిన ఓ టీడీపీ నేత అండదండలతో బుజ్జి నాటుసారా వ్యాపారం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. గత మార్చిలోనూ ఇదే విధంగా నాటుసారా తరలిస్తుండగా కాకినాడ రూరల్‌ పోలీసులకు చిక్కినట్లు అధికారులు వెల్లడించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top