సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య | Software Engineer Commit Suicide In Badvel | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య

Sep 13 2018 1:15 PM | Updated on Oct 22 2018 7:50 PM

Software Engineer Commit Suicide In Badvel - Sakshi

వెంకటసుబ్బారెడ్డి మృతదేహం

భార్యను కాపురానికి రావాలని అడుగుతున్నప్పటికీ రాకుండా...

సాక్షి, బద్వేలు అర్బన్‌: వైఎస్సార్‌జిల్లా బద్వేలు మండల పరిధిలోని గొడుగునూరు గ్రామానికి చెందిన భూమిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి (32) అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ బుధవారం తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతిచెందాడు.

గొడుగునూరు గ్రామానికి చెందిన భూమిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నరసమ్మలకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. రెండో సంతానమైన వెంకటసుబ్బారెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఈయనకు 13 నెలల క్రితం బి.మఠం మండలం గంగిరెడ్డిపల్లెకు చెందిన స్వర్ణలతతో వివాహమైంది. ఆమె కూడా హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. బుధవారం హైదరాబాద్‌ నుంచి స్వగ్రామానికి చేరుకున్న వెంకటసుబ్బారెడ్డి కొద్దిసేపటికే ఉరి వేసుకున్నాడు. తల్లిదండ్రులు కిందికి దించగా అప్పటికే మృతిచెందాడు.

కొన్ని నెలలుగా భార్యభర్తల మధ్య ఏర్పడిన విబేధాల వల్ల ఇరువురు వేర్వేరుగా ఉంటున్నట్లు తెలిసింది. తన భార్యను కాపురానికి రావాలని అడుగుతున్నప్పటికీ రాకుండా వేధింపులకు గురి చేస్తుండేదని, అందుకే తమ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement