ఘోర ప్రమాదం: ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి | Road Accident At Amanagal | Sakshi
Sakshi News home page

ఘోర ప్రమాదం: ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి

Jul 8 2019 6:50 PM | Updated on Jul 8 2019 6:59 PM

Road Accident At Amanagal - Sakshi

సాక్షి, రంగారెడ్డి: జిల్లాలోని అమనగల్  పట్టణ సమీపంలో కల్వకుర్తి-హైదరాబాద్ ప్రధాన రహదారి మెడిగడ్డ వద్ద  ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న వారిని మృత్యువు వెంటాడింది. లారీ-ఇనోవా కారు ఢీకొన్న.. ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. వివరాలు.. వరంగల్ జిల్లా కాజీపేట మండలం మట్టువడా పోలీస్‌ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న దుర్గ ప్రసాద్ అతని కుటుంబంతో కలిసి శ్రీశైలం దైవ దర్శనానికి వెళ్లారు.

కార్యక్రమం అనంతరం.. హైదరాబాద్ వైపు తిరిగి వస్తుండగా అమన్‌గల్ మండలం మెడిగడ్డ సమీపంలో గణపతి వేబ్రిడ్జ్  కాంట కోసం లారీ టర్న్ అవుతుండగా వారు ప్రయాణిస్తున్న ఇనోవా కారు బలంగా ఢీ కొట్టింది. దీంతో వాహనంలో ఉన్న దుర్గ ప్రసాద్ భార్యా విజయ లక్ష్మి, కొడుకు శాంతన్, అతని బావ రాజు, అక్క అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయ్యింది.


Advertisement
 
Advertisement
Advertisement