
సాక్షి, కడప: పోలీసుల భయంతో చెరువులో దూకిన ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడప నగరంలో చోటుచేసుకుంది. పేకాట ఆడుతున్న వారిని పోలీసులు వెంబడించడంతో ముగ్గురు యువకులు పుట్లంపల్లి చెరువులోకి దూకారు. దీంతో వారు గల్లంతయ్యారు. వారిలో ఒకరి మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడిని వీరన్నగా గుర్తించారు. మిగతా ఇద్దరి కోసం ఈతగాళ్ల సాయంతో పోలీసులు గాలింపు జరుపుతున్నారు.