ఊరు మారినా.. ఆమె తీరుమారలేదు | Police Attack On Prostitution Houses Rangareddy | Sakshi
Sakshi News home page

ఊరు మారినా.. ఆమె తీరుమారలేదు

Oct 7 2018 12:17 PM | Updated on Oct 7 2018 4:45 PM

Police Attack On Prostitution Houses Rangareddy - Sakshi

ఇన్‌ సెట్‌లో పద్మమ్మ

పెద్దఅంబర్‌పేట (రంగారెడ్డి): బాలికను బలవంతంగా వ్యభిచారరొంపిలోకి దింపిన ఓ మహిళపై రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌భగవత్‌ పీడీ యాక్ట్‌ నమోదు చేశారు. వివరాల్లో వెళితే... యాదగిరిగుట్టలో వ్యభిచార గృహాలపై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో వ్యభిచార గృహ నిర్వాహకురాలు పాకనాటి పద్మమ్మ అనే మహిళ అక్కడి నుంచి అబ్దుల్లాపూర్‌మెట్‌ గ్రామానికి మకాం మార్చింది.

ఇక్కడ కూడా ఓ మహిళ, ఓ బాలికతో బలవంతంగా వ్యభిచారం నిర్వహిస్తుండగా గత ఆగస్టు 9వ తేదీన బాలిక వ్యభిచార గృహం నుంచి తప్పించుకుని వచ్చి అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులకు సమాచారం అందించింది. దీంతో పోలీసులు వ్యభిచారం గృహంపై దాడి చేసి నిర్వాహకురాలు పద్మమ్మతో పాటు మరో మహిళను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. బాలికను రెస్క్యూ హోంకు తరలించారు. విచారణ చేపట్టిన పోలీసులు శనివారం వ్యభిచార గృహ నిర్వాహకురాలు పద్మమ్మపై పీడీ యాక్ట్‌ నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement