‘చంద్రన్న బీమా’ నుంచి కాల్‌.. లక్ష పేరిట టోకరా!

Online Fraud in Anantapur In The Name OF Chandranna Bima - Sakshi

సాక్షి, అమరావతి: చంద్రన్న బీమా పథకం పేరుతో ఓ యువకుడికి టోకరా ఇచ్చారు ఆన్ లైన్ కేటుగాళ్లు. అనంతపురం జిల్లా గుత్తి మండలం లచ్చానిపల్లికి చెందిన గురుప్రసాద్  అనే యువకుడికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ‘విజయవాడ చంద్రన్న బీమా వింగ్ నుంచి ఫోన్ చేస్తున్నాం. మీకు లక్ష రూపాయల  విడుదలయ్యింది. మీ అకౌంట్ నెంబర్‌తో పాటు ఏటీఎం డిటైల్స్ అందించాలి’ అని మోసగాళ్లు కోరారు. చంద్రన్న బీమా డబ్బులు వస్తాయని ఆశపడిన ఆ యువకుడు.. ఏటీఎం డిటైల్స్ అందించారు. అంతే తన అకౌంట్‌లోని 40 రూపాయలు మాయమయ్యాయని వాపోతున్నాడు బాధితుడు. మోసపోయానని తెలుసుకున్న గురుప్రసాద్  పోలీసులను ఆశ్రయించాడు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top