పబ్‌లో అశ్లీల నృత్యాలు | Obscene dances in Tat Pub Hyderabad | Sakshi
Sakshi News home page

పబ్‌లో అశ్లీల నృత్యాలు

Jan 13 2020 7:28 AM | Updated on Jan 13 2020 8:31 AM

Obscene dances in Tat Pub Hyderabad - Sakshi

పోలీసుల అదుపులో యువతులు

బంజారాహిల్స్‌: జూబ్లీహిల్స్‌ రోడ్‌  నెం.10లోని టాట్‌ పబ్‌లో అశ్లీల నత్యాలు చేస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించి 23 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం సాయంత్రం పలువురు యువతీ యువకులు పబ్‌లో ఏర్పాటు చేసుకున్న పార్టీలో భాగంగా కొందరు యువతులను రప్పించి అశ్లీల నృత్యాలు చేయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. బంజారాహిల్స్‌ ఏసీపీ ఆదేశాలతో అక్కడికి చేరుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు.

ఈ సందర్భంగా   22 మంది యువతులను అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అయితే తాము పార్టీ చేసుకోవడానికి వచ్చామని తమను ఎందుకు వీడియోలు తీస్తున్నారంటూ యువతులు మీడియా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  సెల్‌ఫోన్లు లాక్కొని  కిందపడేశారు. కాగా సీడ్స్‌ కంపెనీకి చెందిన ఓ వ్యక్తి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిసింది. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement