
పహేళిదాస్ (ఫైల్)
నాగోలు: అనుమానాస్పద స్థితిలో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎల్‌బీనగర్ పీఎస్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. త్రిపుర రాష్ట్రంలోని రామనగర్ జిల్లాకు చెందిన పహేలిదాస్ హస్తినాపురంలోని కస్తూరి స్కూల్‌ఆఫ్ నర్సింగ్ కళాశాలలో రెండో సంవత్సరం నర్సింగ్ కోర్సు చదువుతోంది. శుక్రవారం మధ్యాహ్నం హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటాన్ని గుర్తించిన తోటి విద్యార్థినులు వార్డెన్‌కు సమాచారం అందించారు. ఎల్‌బీనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు కారణాలుతెలియరాలేదన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.