పెన్షన్‌ కోసం తల్లి శవాన్ని..

Mothers Body Kept In Freezer At Home - Sakshi

కోల్‌కతా, పశ్చిమ బెంగాల్‌ : డబ్బుకు లోకం దాసోహం. ఇది ఊరికే చెప్పలేదు. ఎందుకంటే డబ్బే ప్రధానం అన్నింటికి. అన్ని బంధాలను నిలిపేది, పడగొట్టేది ఈ డబ్బే. దీనికి తార్కాణంగా నిలిచే ఘటన ఒకటి కోల్‌కతాలో చోటుచేసుకుంది. తల్లికి వచ్చే పెన్షన్‌ డబ్బుల కోసం ఆమె మరణాన్ని కూడా లోకానికి తెలియకుండా చేశాడు. తల్లి శవాన్ని ఇంట్లోని ఫ్రిజ్‌లోనే దాచిపెట్టారు. ఆమె కొడుకు, భర్త కలిసి ఈ పని చేశారు. తల్లికి వచ్చే పెన్షన్‌ డబ్బుల కోసం ఆమె బతికే ఉన్నట్లుగా సర్టిఫికేట్స్‌ కూడా సృష్టించాడు.

వివరాలు...కోల్‌కతాకు చెందిన బీనా మజుందార్‌ ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో పనిచేస్తు ఉండేది. అనారోగ్యం కారణంగా 2015 ఏప్రిల్‌ 7న హాస్పిటల్‌లో మరణించింది. అయితే అప్పటి నుంచి తన భర్త గోపాల్‌ మజుందార్‌, కుమారుడు సుప్రభాత్‌ మజుందార్‌లు ఆమె శవాన్ని ఇంట్లోనే ఫ్రిజ్‌లో దాచిపెట్టారు. ఇరుగు పొరుగు వారు అడిగితే మార్చురీలో ఉందని చెప్పేవారు. బీనా మజుందార్‌కు వచ్చే పెన్షన్‌ డబ్బులను గత రెండేళ్ల నుంచి వీరే డ్రా చేస్తున్నారు. అయితే పెన్షన్‌ కోసమే ఇలా చేసుండవచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. శవంపై కత్తి గాట్లు ఉన్నాయని, పోస్ట్‌మార్టంకు తరలించామని దాని తర్వాతే అసలు నిజాలు చెప్పగలమని పోలీసులు పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top