జిల్లేడు పాలు పోసి ఆడ శిశువు హత్య

Mother And Grandmother Held in Girl Child Assassinated Case - Sakshi

అమ్మ, అమ్మమ్మ అరెస్ట్‌

చెన్నై, అన్నానగర్‌: ఆండిపట్టి సమీపంలో గురువారం జిల్లేడి పాలు ఇచ్చి ఆడ శిశువుని హత్య చేసిన తల్లి, అమ్మమ్మను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. తేని జిల్లా ఆండిపట్టి సమీపంలోని మెట్టనూత్తు పంచాయతీ రామనాథపురానికి చెందిన సురేష్‌. భార్య కవితా (29). సురేష్‌ కేరళాలో ఉన్న కోలిక్కోడులో మేస్త్రీ పని చేస్తూంటాడు. వీరికి కుమార్తెలు పాండి మీనా (10), హరిణి (8) ఉన్నారు. ఈ క్రమంలో కవితా మూడోసారి గర్భం దాల్చింది. ప్రసవం కోసం ఫిబ్రవరి 20న క.విలక్కు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అదే నెల 26న ఆమెకు సాధారణ  ప్రసవం ద్వారా ఆడ బిడ్డ పుట్టింది. 2 రోజుల తరువాత ఇంటికి వచ్చారు.

ఈ క్రమంలో మార్చి 2న కవితా తల్లిపాలు ఇచ్చినప్పుడు విరోచనాలు ఏర్పడి బిడ్డ మృతి చెందినట్లుగా పలికి ఇంటి సమీపంలో ఉన్న స్థలంలో పాతి పెట్టారు. స్థానికులు దీనిపై అనుమానంతో జిల్లా శిశు సంక్షేమ రక్షణ కార్యాలయం, ఆండిపట్టి తహసీల్దార్‌ చంద్రశేఖర్‌కి  సమాచారం అందించారు. తహసిల్దార్‌ చంద్రశేఖర్‌ గ్రామ నిర్వాహక అధికారి దేవి, రాజధాని పోలీసులు కవితా, అత్త చెల్లమ్మాల్‌ వద్ద తీవ్ర విచారణ చేశారు. గురువారం విచారణలో కవితా, ఆమె అత్త చెల్లమ్మాల్‌ జిల్లేడి పాలు ఇచ్చి హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. పోలీసులు బిడ్డ మృతదేహాన్ని గురువారం బయటకి తీసి అక్కడే ప్రభుత్వ డాక్టర్‌తో పోస్టుమార్టం చేయించారు. ఇందులో జిల్లేడిపాలు ఇచ్చి బిడ్డని హత్య చేసిన విషయం తేలింది. దీంతో ఇద్దరిని అరెస్టు చేశారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top