ఇద్దరు వివాహితల అదృశ్యం | Married Womens Missing in Visakhapatnam | Sakshi
Sakshi News home page

ఇద్దరు వివాహితల అదృశ్యం

Feb 13 2019 7:18 AM | Updated on Feb 13 2019 7:18 AM

Married Womens Missing in Visakhapatnam - Sakshi

సుప్రియ (ఫైల్‌) స్వాతి (ఫైల్‌)

పెదవాల్తేరు(విశాఖ తూర్పు):ఎంవీపీ కాలనీ, వాంబేకాలనీలకు చెందిన ఇద్దరు వివాహితలు అదృశ్యమయ్యారు. ఈమేరకు ఆయా పోలీస్‌స్టేన్ల లో ఫిర్యాదులు అందాయి.  ఎంవీపీ కాలనీ సెక్టార్‌ – 9 ఫిషర్‌మేన్‌కాలనీలో శ్రీకాంత్,జి.సుప్రియ (29) దంపతులు నివసిస్తున్నారు. శ్రీకాంత్‌ పోర్టులో ప్రైవేట్‌ కాంట్రాక్టర్‌ వద్ద పనిచేస్తున్నారు. సుప్రియ సోమవారంసాయంత్రం ఆస్పత్రికి ఇం  ట్లోంచి వెళ్లింది. అనంతరం ఇంటికి చేరకపోవడంతో బంధువులు, తెలిసిన వారి ఇళ్లలో భర్త వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో మంగళవారం ఎంవీపీ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. సీఐ ఎన్‌.సన్యాసినాయుడు పర్యవేక్షణలో హెడ్‌ కానిస్టేబుల్‌ ప్రసాదరావుకేసుదర్యాప్తుచేస్తున్నారు.

వాంబేకాలనీలో మరో వివాహిత...
పీఎం పాలెం(భీమిలి): ఓ వివాహిత అదృశ్యంపై పీఎం పాలెం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదయింది.  స్థానిక సీఐ కె.సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... జీవీఎంసీ 5వ వార్డులోని వాంబేకాలనీలో బొడ్డు సతీష్, స్వాతి దంపతులు నివసిస్తున్నారు. ఈ నెల 4న స్వాతి(20) ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆమె ఆచూకీ లేకుండాపోయంది. బంధువులు, తెలిసిన వారి ఇళ్లలో వెతికినా ఫలితం లేకపోవడంతో స్వాతి అత్త దేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement